ప్రొ కబడ్డీలో ఫైనల్​ కి దూసుకెళ్లిన జైపూర్​.. సందడి చేసిన ఐశ్వర్యా రాయ్​ కుటుంబం

  • సెమీఫైనల్లో 49–29తో బెంగళూరుపై విజయం
  • అన్ని విభాగాల్లోనూ అదరగొట్టిన జైపూర్
  • జైపూర్ ఆటగాళ్లను ఉత్సాహపరిచిన ఐశ్వర్య ఫ్యామిలీ  
ప్రొ కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్ లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో జైపూర్ 49–29 స్కోరు తేడాతో బెంగళూరు బుల్స్ ను చిత్తుగా ఓడించింది. తమ యజమానులు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ సమక్షంలో జైపూర్ ఆటగాళ్లు అద్భుత ఆట తీరు కనబరిచారు. రైడింగ్, ట్యాకిల్ పాయింట్లలో సత్తా చాటి మ్యాచ్ ను ఏకపక్షం చేశారు. జైపూర్ తరఫున రైడర్ అజిత్ కుమార్ 13 రైడ్ పాయింట్లతో చెలరేగాడు. 

డిఫెండర్ షావుల్ కుమార్ 10 పాయింట్లు రాబట్టాడు. మరోవైపు బెంగళూరు బుల్స్ అన్ని విభాగాల్లో నిరాశ పరిచింది. ఏ దశలోనూ జైపూర్ కు పోటీ ఇవ్వలేకపోయింది. రైడర్ భరత్ ఏడు పాయింట్లతో ఆకట్టుకున్నాడు. వికాస్ ఖండోలా (5), నీరజ్ నర్వాల్ (4) కాస్త ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఇక, ఈ మ్యాచ్ కు జైపూర్ యజమానులు ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ హాజరయ్యారు. తమ కూతురుతో కలిసి జైపూర్ ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.

Aishwarya Rai
Pro Kabaddi
final
jaipur

More Telugu News